Nill........
The Passport Verification Status is only for the residents of Vizag district Police Jurisdiction and from July 2009 onwards.
Content & Updation :: Special Branch , Vizag district Police
అపరిచితులు మీ ఏరియాలో అనుమానస్పదముగా తిరుగుతున్న యెడల మీ సన్నిహుతులు లేదా మీ ఊరి పెద్దల సహాయముతో ఆ అపరచితులను ప్రశ్నించండి. వారు మీ ఏరియాలో ఎందుకు తిరుగుతున్నారో తెలుసుకోండి, మీ అనుమానం బలపడితే వెంటనే Dial 100 కు Phone చేసి గాని, మీ సమీప పోలీస్ వారికి గాని తెలియజేసి రక్షణ పొందండి. .....మీ విశాఖ జిల్లా పోలీస్.
బైక్ పై వచ్చినవారు గొలుసు దొంగతనంనకు పాల్పడిన వెంటనే... బాధితులు గాని, ప్రత్యక్ష సాక్ష్యులు గాని ఆ నేరస్తుల యొక్క బైక్ నెంబర్ గుర్తు పెట్టుకొని పోలీస్ వారికి తెలిపినచో ఆ నేరస్తులను పట్టుకొని కోర్టువారి ఎదుట హాజరు పరిచి వారికి శిక్ష పడేటట్లు చేయగలరు. కావున గొలుసు పోగొట్టుకున్న బాధితులు ఈ విషయం పై దృష్టి పెట్టగలరు. ... మీ విశాఖ జిల్లా పోలీస్.
మీ చుట్టుప్రక్కల అనుమానిత బ్యాగులు గాని, బాక్స్ లు గాని కనిపించి వాటి యజమాని ఎవరో తెలియని పక్షములో సమీప పోలీస్ స్టేషను కు గాని, DIAL 100 కు గాని వెంటనే ఫోన్ చేసి ఆ విషయాన్ని తెలియజేయగలరు. .. మీ విశాఖ జిల్లా పోలీస్.
రద్దీగా వుండే ప్రదేశాలలో జేబు దొంగలు వుండే అవకాశముంది. కావున మీ నగదు, బంగారు వస్తువులు మరియు మీ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తతో వుండండి. ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే మీ బందువులకు గాని, సన్నిహితులకు ఆ విషయం చెప్పి ఆ అనుమానితునిపై నిఘా వుంచండి, మీ అనుమానం నిజమైతే తక్షణమే మీ సమీప పోలీస్ వారికి గాని DIAL 100 ద్వారా తెలియజేయండి. .. మీ జిల్లా పోలీస్.
కరెంట్ లైన్ మెన్ అంటూ, మీ కరెంటు మీటరులో లోపం వుంది బాగుచేయాలి, మీ మేడలో వున్నా బంగారు గొలుసు ఒకసారి ఇస్తే దానిని మీటరులో పెట్టి బాగుచేస్తాం, మీము వెళ్ళినతరువాత దానిని మీరే తీసుకొందురుగాని అంటూ నకిలీ కరెంట్ లైన్ మెన్ మీ ఇంటి తలుపు తట్టవచ్చు ... తస్మాత్ జాగ్రత్త . మోసపోకండి, అలాంటి వారు మీకు కనిపిస్తే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి మోసగాడి ఆటలు కట్టించండి.
మీరు మీ పనిలో నిమగ్నమై వున్నపుడు, మోసగాలు మీ దుస్తులపై అసభ్య పదార్ధాలను జల్లి మీకు ఆ విషయాన్ని చెపుతారు, మీరు ఆందోళనలో ఉండగానే మీ బ్యాగ్ గాని మని పర్స్ గాని మీకు తెలియకుండా తీసేసి జారుకొంటారు తస్మాత్ జాగ్రత్త
ATM Center వద్ద మీరు అపరచితుల సహాయాన్ని కోరవద్దు. మిమ్మలను ఏమార్చి మీ ATM card స్థానములో వారి Duplicate ATM Card ని మీకు ఇచ్చి మీరు వెళ్ళిన తరువాత మీ నగదు with draw చేసుకొనే ప్రమాదమున్నది. తస్మాత్ జాగ్రత్త !
షేర్ ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ బ్యాగ్, మీసామాగ్రి జాగ్రత్తగా ఉంచుకోండి. మద్యలో ఆటో ఎక్కే ప్రయాణికులు మీ బ్యాగ్ లేదా మీ సామాగ్రిని పట్టుకొని ఆటో స్టాండ్ కు ముందుగానే దిగిపోయే ప్రమాదముంది. తస్మాత్ జాగ్రత్త !
Utilise Locked House Management System Services (LHMS) providing by Police of your nearest Police Station, functioning in Anakapalli and Narsipatnam Sub-Division limits. For more details visit above Police Stations.......... District Police.
District Police Alerting Public who are residing near Coastal areas regarding Phethai Cyclone... Fishermen not to go sea for boating --- Sri Attada Babujee IPS, SP Visakhapatnam District